నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: స్పీకర్

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యులపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఆయన ఈ ప్రకటన చేశారు. తన వ్యాఖ్యలను సభ్యులను బాధపెట్టి ఉంటే వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం సభ్యులను ఆయన బుధవారం నాన్సెన్స్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మర్యాదగా వ్యవహరించడం స్పీకర్ నేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. స్పీకర్ ప్రకటనతో గురువారం ఉదయం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.

ప్రతిపక్షాలు గురువారం ఉదయం ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. చేతివృత్తుల పనివారి సమస్యలు, బడ్జెట్ లో నిధుల లేమిపై ప్రజారాజ్యం పార్టీ, హైదరాబాదుకు నిధుల కొరతపై బిజెపి, బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ షో విషాదంపై సిపిఐ, మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై సిపిఎం వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+