నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై నెహ్రూ ప్రకటనకు 54 ఏళ్ళు

By Santaram
|
Google Oneindia TeluguNews

Jawaharlal Nehru
కమ్మర్‌ పల్లి: 'తెలంగాణ వంటి అమాయకురాలైన అమ్మాయి...గడసరి ఆంధ్ర అబ్బాయితో వివాహం చేస్తున్నాం. వీరి కాపురం సజావుగా సాగని పక్షంలో ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చునని' భారత మొదటి ప్రధాని పండిట్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ నిజామాబాద్‌లో చేసిన ప్రకటనకు నేటితో 54 ఏళ్లు పూర్తయ్యాయని చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి స్మారక కమిటీ గౌరవ అధ్యక్షుడు ఎండీ అహ్మద్‌ తెలిపారు. కమ్మర్‌ పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన జిల్లా పరిషత్తు మొదటి చైర్మన్‌, స్వాతంత్ర సమరయోధుడు చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి అధ్యక్షతన భారత్‌ సేవక్‌ సమాజ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా 1965 మార్చి 5వ తేదీన నిజామాబాద్‌లో సభ జరిగిందన్నారు.

ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జవహార్‌లాల్‌ నెహ్రూ పై విధంగా ప్రకటించారన్నారు. నెహ్రూ ప్రకటన చేసి 54 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం నిజామాబాద్‌లోని రాజీవ్‌ ఆడిటోరియంలో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ హాజరవుతారన్నారు. మాజీ ప్రధాని చేసిన ప్రకటనను గౌరవించి తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. నెహ్రూ ప్రకటనకు సాక్షిగా ఉన్న చౌట్‌ పల్లి హన్మంత్‌ రెడ్డి, మనవడు మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి తెలంగాణ కోసం కృషి చేస్తున్నారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X