నెల్లూరు: సూళ్లూరుపేట ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు పక్షుల పండుగ (ఫ్లెమింగో ఫెస్టివల్)ను రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు ప్రారంభిస్తారు. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని పక్షుల పండుగకు ముస్తాబు చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పలురకాల పక్షులు భారీగా ఇక్కడికి తరలివస్తాయి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రతి ఏడాది పక్షుల పండుగ నిర్వహిస్తారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా పక్షి ప్రేమికులు కూడా ఇక్కడికి తరలివస్తారు.