కాజీపేట: సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాజీపేటలో తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. కాజీపేట 32వ డివిజన్ బోడగుట్టలో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణపు పనులను ప్రారంభించడానికి అధికారులు, స్థానిక ప్రజాప్రతిని ధులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథిగా రాజయ్య హాజరవుతున్నారనే సమాచారం మేరకు టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు రైల్వేస్టేషన్‌లోనే ఎంపీని ఘెరావ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ను వేగవంతం చేయాలని, విద్యార్థులు ప్రాణత్యాగా లు చేస్తుంటే ప్రారంభోత్సవాల పేరిట ఊరేగుతున్నారని నిలదీశారు.
కార్యకర్తలకు నచ్చజెప్పడానికి రాజయ్య ప్రయత్నించినా వారు వినకపోవడంతో చేసేదేం లేక వెనుదిరిగారు. అనంతరం ఎంపీ విలేకరులతో మా ట్లాడుతూ కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించొద్దని, రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణవాదం పేరుతో అనవసరమైన వివాదాలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన సూచించారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్సేనని చెప్పారు. కార్యక్రమంలో రావుల సదానందం, బీజేపీ, టీఆర్ ఎస్ నేతలు రామలింగం, చాంద్, రమేష్, గబ్బెట శ్రీని వాస్, ఎస్.కృష్ణ, అశోక్, కుమార్, శివ పాల్గొన్నారు.