న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం చెలరేగింది. పార్లమెంటు ఉభయ సభలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. ఎస్పీ, బిఎస్పీ, ఆర్జెడీ సభ్యులు సోమవారం లోకసభలో మహిళా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. స్పీకర్ పోడయంపైకి వెళ్లడానికి కూడా ప్రయత్నించారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.