నెల్లూరు మేయర్ ఇళ్లలో ఎసిబి సోదాలు

హైదరాబాదులో భానుశ్రీకి మూడు ప్లాట్లు, నెల్లూరులో 15 ప్లాట్లు ఉన్నట్లు ఎసిబి సోదాల్లో బయటపడినట్లు తెలుస్తోంది. రెండు కార్లు కూడా ఉన్నాయి. ఇతర ఆస్తులను కూడా ఎసిబి అధికారులు కనిపెట్టారు. ఈ ఆస్తులన్నీ భానుశ్రీ పేరు మీద కాకుండా భర్త, ఇతర బంధువుల పేర్ల మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భానుశ్రీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. తనకు ఆస్తులేమీ లేవని భానుశ్రీ సాయిబాబ గుడిలో ఇటీవల ప్రమాణం చేశారు. భానుశ్రీ పేరు మీద ఉన్న ఆస్తులను ఇంకా కనిపెట్టాల్సి ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications