నెల్లూరు: నెల్లూరు జిల్లా దొంతపల్లి గ్రామంలో జరిగిన జంట హత్య కేసులో 16 మందికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు విచారణ పూర్తి చేసిన జిల్లా న్యాయస్థానం గురువారం ఆ మేరకు తీర్పు వెలువరించింది. 2001లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా దొంతపల్లి గ్రామంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలను కాంగ్రెసు నాయకులు, వారి అనుచరులు దారుణంగా హత్య చేశారు.
ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయుకలను కాంగ్రెసు నాయకులు శంకరయ్య, శేఖర్, శీనయ్య, తదితురులు వెంటాడి గొడ్డళ్లతో, కొడవళ్లతో నరికి చంపారు. అప్పట్లో ఈ హత్య నెల్లూరు జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది.