తెరాస, కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్: బాబు

తెలుగుదేశం బహిష్కరణతో అది తెలంగాణ జెఎసి కాకుండా పోయిందని, తెరాస జెఎసిగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అది తెరాస జెఎసి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నాయకులకు సూచించారు. రాజీనామాలు చేయని కాంగ్రెసు పార్టీ పట్ల జెఎసి ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీనే వారు టార్గెట్ గా చేసుకున్నారని ఆయన విమర్సించారు. పార్లమెంటు సభ్యత్వాలకు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి ఎందుకు రాజీనామా చేయలేదని, అందుకు జెఎసి నుంచి తెరాసను ఎందుకు బహిష్కరించలేదని ఆయన అడిగారు. తెలంగాణ ఉద్యమాన్ని, పార్టీని కాపాడుకోవాలని ఆయన తెలంగాణ నాయకులకు సూచించారు.