భర్తను చంపేసి గుడికెళ్లిన భార్య!

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. భార్య పుట్టింటికి వచ్చిన ఓ భర్త.. దంపతుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో కన్నకొడుకును తలకిందులుగా వేలాడదీసిన భర్తను.. ఆ కన్నతల్లి కర్రతో కొట్టి చంపేసింది. నిందితురాలిని నీలమ్ కుష్వాహాగా గుర్తించారు. భర్త దీన్‌దయాల్ కుష్వాహాను హతమార్చిన అనంతరం.. ఆమె ఆ శవం వద్దే దాదాపు 8 గంటల పాటు కూర్చుంది. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది.

కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో..
పోలీసులు వెల్లడించింన వివరాల ప్రకారం.. నీలమ్ గత నాలుగేళ్లుగా తన భర్త దీన్‌దయాల్ కుష్వాహాకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది. జూన్ 1వ తేదీన దీన్‌దయాల్ పూర్తిగా మద్యం మత్తులో నీలమ్ పుట్టింటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లోకి బలవంతంగా చొరబడిన దీన్‌దయాల్.. తన కొడుకును కాళ్లు పైకి పెట్టి తలకిందులుగా వేలాడుదీశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన నీలమ్.. తన భర్త కొడుకును ఎక్కడ చంపేస్తాడోనని భయపడింది. ఆ ఆవేశంలోనే పక్కనే ఉన్న ఓ కర్రను తీసుకుని దీన్‌దయాల్‌పై బలంగా దాడి చేసింది.

MP Shocker Drunk Man Hangs Son Upside Down Terrified Wife Beats Him To Death In Chhatarpur

తీవ్ర గాయాలతో మృతి.. శవం వద్దే 8 గంటలు
మొదటి దెబ్బ పడగానే దీన్‌దయాల్ అక్కడే ఉన్న మంచంపై పడిపోయాడు. అయినప్పటికీ నీలమ్ ఆవేశం చల్లారక.. కొడుకును కాపాడుకోవాలనే కంగారులో అతనిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేస్తూనే ఉంది. ఈ తీవ్రమైన దెబ్బల కారణంగా దీన్‌దయాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భర్త చనిపోయాడని గ్రహించిన నీలమ్ .. ఆ భయాందోళనలోనే దాదాపు 8 గంటల పాటు శవం పక్కనే కూర్చుండిపోయింది.

గుడిలో క్షమాపణలు.. ఆపై పోలీస్ స్టేషన్‌లో లొంగిబాటు
ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నీలమ్.. స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్ళింది. అక్కడ దేవుడి ముందు దాదాపు 10 నిమిషాల పాటు కూర్చుని, తాను చేసిన తప్పుకు క్షమాపణలు వేడుకుంది. అక్కడి నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. రాత్రి 8 గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లిన ఆమె.. తానే తన భర్తను చంపేశానని అక్కడి పోలీసుల ఎదుట అంగీకరించి లొంగిపోయింది.మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంట్లోని మంచంపై పడి ఉన్న దీన్‌దయాల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నీలమ్ చేసిన వేధింపులు, దాడి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+