ఆ హత్య చేసింది పోలీసు కానిస్టేబులే

East Godavari Dist
సామర్లకోట: కాళ్లు కడిగి మరదలిని కన్యాదానం చేసిన వ్యక్తిని, ఆమెకు భర్త, అతడికి తోడల్లుడు అయిన వ్యక్తే కాలయముడై హతమార్చిన సంఘటన పట్టణంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, జగ్గంపేటకు చెందిన పాన్ ‌షాప్‌ నిర్వాహకుడు జాస్తి శ్రీరామచంద్రరావు, పెద్దాపురం సీఐ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నిమ్మలపూడి వీర వెంకట రమణ తోడల్లుళ్లు. రామచంద్రరావే తన మరదలికి, వెంకట రమణతో వివాహం జరిపించాడు. శ్రీరామచంద్రరావు వద్ద తోడల్లుడు వెంకట రమణ గతంలో రూ.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తం తిరిగివ్వాలంటూ శ్రీరామచంద్రరావు ఒత్తిడి చేశాడు.

ఈ నేపథ్యంలో వెంకట రమణ ఆ సొమ్ము ఇస్తానని నమ్మబలికి తోడల్లుడిని ఈ నెల పదో తేదీ ఉదయం సామర్లకోట రప్పించాడు. అప్పటి నుంచీ శ్రీరామచంద్రరావు ఆచూకీ తెలియరాలేదు. శ్రీరామచంద్రరావు ఆదశ్యమైనట్టు వెంకట రమణ ఈ నెల 12న సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే తన భర్తను మరిది వెంకట రమణ జగ్గంపేట నుంచి సామర్లకోట రప్పించి మాయం చేశాడని, హత్య చేసి ఉండవచ్చని, ఈ నెల 13న శ్రీరామచంద్రరావు భార్య గీత సామర్లకోట పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది.

దీంతో సీఐ కె.విజయ్‌ శేఖర్‌ కానిస్టేబుల్‌ను ఆదివారం అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తోడల్లుడిని తానే హత్య చేసినట్టు రమణ సోమవారం రాత్రి అంగీకరించాడు. మృతదేహాన్ని స్థానిక సుధ ఫ్యాక్టరీ వెనుక పొలాల్లో పూడ్చినట్టు తెలిపాడు. అతడికి సహకరించినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, నిందితుడు తానొక్కడినే ఈ నేరం చేసినట్టు చెప్తున్నాడు. ఎస్పీ వై.నాగిరెడ్డి, మండల మేజిస్ట్రేట్‌ల సమక్షంలో మృతదేహాన్ని బుధవారం ఉదయం వెలికి తీయనున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+