బోరు బావిలో పడి బాలుడు మృతి

భోపాల్ నుంచి 350 కి.మీ. దూరంలో ఉన్న రత్లామ్ జిల్లా మాల్వాస గ్రామంలో సూరజ్ అనే ఈ బాలుడు మంగళవారం సాయంత్రం ఆటలాడుతున్న సమయంలో తెరచిఉన్న బోరుబావిలో పడిపోయాడు. అయితే ఈ బావి మూతను సూరజ్ తండ్రి వీరేంద్ర రాథోడ్ సోమవారం రాత్రి తొలగించిన ట్లు సమాచారం.
బుధవారం రాత్రి 9:30 వరకు సహాయక దళం పిలుపుకు స్పందించిన సూరజ్ అటుపై జవాబివ్వలేదు. జిల్లా కలెక్టర్ మహేంద్ర గ్యానీ విలేకర్లతో మాట్లాడుతూ 'సూరజ్‌ను రక్షించటానికి శాయశక్తులా ప్రయత్నించాం. ఆక్సిజన్‌ను సైతం బావిలోకి పంప్ చేశాం. బోరుబావి చుట్టూ ఉన్న నేలను తవ్విన ప్రతిసారీ మట్టి లోపలికి పడిపోతుండటంతో సైన్యం సహాయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.' అని అన్నారు. కాని సైనికులు సైతం ఈ సమస్య వల్ల త్వరగా పని చేయలేకపోయారు.












Click it and Unblock the Notifications