హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బెదిరింపు లేఖపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎకె ఖాన్ తెలిపారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ప్రధానన్యాయమూర్తికి బెదిరింపులేఖరాశారు. ఈకేసుకు సంబంధించి ఇప్పటి వరకూ ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
ప్రధాన న్యాయమూర్తికి బెదిరింపు లేఖ రావడంతో ఆయనకు భద్రతను మరింత పెంచారు. సాధారంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు తగినంత భద్రత ఉంటుంది. ఇప్పుడు మరింత అధికం చేశారు.