శ్రీరాముడి కల్యాణానికి భద్రాద్రి ముస్తాబు

ఇప్పటికే పలువురు భక్తులు భద్రాచలం చేరుకుని వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను తిలకిస్తున్నారు. ఇప్పటికే వేసిన చలువ పందిళ్ల కింద సేద తీరుతున్నారు. భద్రాచలంతో పాటు పర్ణశాలలోనూ రామాలయాన్ని సుందరంగా తీర్చి దిద్దారు. భద్రాచలం వచ్చిన భక్తులంతా పర్ణశాలకు వెళ్లే అవకాశం ఉన్నందున అక్కడ కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
పట్టణంలోని కొన్ని బ్యాంకులతో పాటు ఇతర ప్రాంతాలలోనూ కల్యాణ టికెట్లు, తీర్థప్రసాద టికెట్లు విక్రయిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వారికి కుక్కునూరులో ఇద్దరు భక్తులు అన్నదానం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని పలు రామాలయాలు సైతం సీతారాముల కల్యాణ వేడుకలకు ముస్తాబయ్యాయి.












Click it and Unblock the Notifications