వైయస్ ఫ్యామిలియే కావడం బాధాకరం: విహెచ్

V Hanumantha Rao
హైదరాబాద్: రైతులకు తెలియకుండా వారి భూములను కర్నూలు జిల్లాలో లీజుకు తీసుకున్న వ్యవహారంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులే ఉండడం బాధాకరమని కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రైతులు కంట తడి పెట్టకూడదనేది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష్యమని, అందుకు విరుద్ధంగా వ్యవహారాలు నడిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని భావిస్తున్నానని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

రైతులకు తెలియకుండా వారి భూములను లీజుకు తీసుకున్న వ్యవహారానికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్య, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తెస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+