కాకినాడ ప్రజలకు మళ్ళీ సైరన్ భాగ్యం

జిల్లా ప్రణాళిక మండలి సభ్యుడు, సీనియర్ కార్పొరేటర్ దండు మహంతి లకణరావు కాకినాడ వాసులకు మళ్లీ సైరన్ కూత యథావిధిగా వినిపించాలంటూ కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో దాదాపు రూ.లక్ష వెచ్చించి వాటర్‌వర్క్స్‌లో కొత్త సైరన్‌ను కొద్దిరోజుల క్రితమే ఏర్పాటు చేశారు. ఈ సైరన్‌కూత దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పరిధి వరకు వినిపిస్తుంది. పాత జ్ఞాపకాలకు గుర్తుగా పునరుద్ధరిస్తున్న ఈ సైరన్ నిర్వహణ బాధ్యతను కార్పొరేషన్ చేపడుతోంది. త్వరలో ఈ సైరన్‌ను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications