నిట్ వివాదం: ఢిల్లీ చేరిన విద్యార్ధులు, వైవి రావు

నిట్ విద్యార్థులు గురువారం ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం జరగనున్న నిట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో వై.వి.రావుపై ఫిర్యాదు చేయనున్నారు. పనిలోపనిగా కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు విద్యార్థులు తెలిపారు. అవసరమైతే ఢిల్లీ విజ్ఞాన భవన్ ఎదుట ఆందోళన చేపట్టేందుకు వెనుకాడబోమని పేర్కొన్నారు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు వై.వి రావు ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఒక నివేదికను సమర్పించనున్నట్లు సమాచారం. తన పలుకుబడితో బయటపడేందుకు యత్నిం లో భాగంగానే ఆయన ఢిల్లీ సమావేశానికి హాజరవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అవసరమైతే బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరగకుండా వాయిదా వేయించాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications