మృతుల కుటుంబాలకు పళ్ళంరాజు హామీ

ప్రభుత్వపరంగా వచ్చే సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చినా బంధువులు శాంతించకపోవడంతో రెండు గంటలపాటు ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు ఎండ నిప్పులు కురిపిస్తుండగా మంత్రి చెట్టు నీడలోనే నిలబడి ఎమ్మెల్యేలు రాజా అశోక్‌బాబు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణులతో పలు దఫాలు చర్చించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సంఘటన స్థలానికి చేరుకుని నష్టపరిహారంపై పల్లంరాజుతో చర్చించారు.
బాధిత కుటుంబాలు ఆశించిన దానికంటే ఎక్కువ పరిహారం వచ్చేలా కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంత్యక్రియల కోసం రూ. మూడు వేలు ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎక్స్ గ్రేషియాతోపాటు ఇన్సూరెన్స్ త్వరితగతిన వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మృతుల బంధువులు శాంతించారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన కాకినాడ బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications