హైదరాబాద్: దోమలగూడలోని సౌభాగ్య అపార్ట్‌మెంట్‌లో ఆదివారం తెల్లారుజామున దుండగులు బీభత్సం సృష్టించారు. అపార్ట్‌మెంట్ బయట నిద్రిస్తున్న వాచ్‌మెన్, అతని కుటుంబసభ్యులపై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. చిన్నారి పాపపై కూడా దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.
వాచ్ మన్ కుటుంబం వద్ద దోచుకోడానికి ఏమీ ఉండవు కాబట్టి దుండగులు ఫ్లాట్స్ లో దొంగతనానికి వచ్చిఉండవచ్చని భావిస్తున్నారు. వారు పైకి వెళ్ళకుండా వాచ్ మన్ అడ్డుకున్నందుకే దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.