హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రశాంత వాతావరణానికి సహకరిద్దాం: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మత సామరస్యానికి, సర్వమత సంయమనానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్ నగరంలో మళ్లీ శాంతియుతవాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న అల్లర్లు దురదష్టకరమని, ఘనమైన చరిత్ర కలిగిన మహానగరానికి ఇలాంటి ఘటనలు మచ్చతెచ్చిపెడుతాయని ఆయన అన్నారు. మత సామరస్యం కాపాడుతూ హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని మన నాయకుడు వైఎస్‌రాజశేఖరరెడ్డి అకాంక్షను భిన్నంగా ఈ రోజు అల్లర్లు చెలరేగడం బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు.

అందరూ సమానులేనన్న భావన ఇలాంటి ఘటనల వల్ల విశ్వాసం కొల్పోయేలా చేస్తాయని, అన్నదమ్ముల్లా అందరూ కలిసుండే విధంగా ప్రజలంతా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సమయాల్లో పుకార్లను నమ్మవద్దని, శాంతి పునరుద్ధరణకు ఒకరికి ఒకరు తోడుగా నిలిచి హైదరాబాద్ నగరంలో చారిత్రాత్మకంగా ఇమిడిపోయిన సర్వమత సంస్కతికి మళ్లీ జీవం పోయాలని ఆయన చెప్పారు. ఆవేశకావేశాలతో ముడిపడి ఉన్న ఈ అల్లర్లు ఆగిపోయేలా చేయడంలో ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యత తీసుకోవాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నానని అని లేఖలో జగన్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X