గుంటూరు: అధికారుల కళ్లు గప్పి రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి పరారైన జీవిత ఖైదీ షేక్ సైదాను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని గుంటూరు జిల్లా మాచర్లలో పోలీసులు అరెస్టు చేశారు. షేక్ సైదా శుక్రవారం రాత్రి పారిపోయాడు. దాంతో పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు.
షేక్ సైదా 2002లో గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన ఒక హత్య కేసులో దోషి. అతనికి కోర్టు జీవిత ఖైదు పడింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో అతను శిక్ష అనుభవిస్తున్నాడు.