ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పగో జిల్లాలో జగన్ సుడిగాలి పర్యటన

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఏలూరు: రాజకీయంగా అత్యంత కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లానుంచే జగన్ ఓదార్పు పర్యటన ప్రారంభించనున్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ మొదట లెగ్ పెట్టేది కృష్ణాజిల్లాలోనే అయినా పర్యటన మొదలయ్యేది పగో జిల్లాలోనే. కృష్ణాజిల్లా గన్నవరం విమాశ్రయం నుంచి జగన్ నేరుగా ఏలూరు వెళ్తారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి, మహానేత వైఎస్‌ ఆకస్మిక మృతిని తట్టుకోలేక గుండెపగిలి మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ నెల 9న మధ్యాహ్నం మూడు గంటలకు వైఎస్‌ జగన్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంటారు. ముందుగా ఏలూరులో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది.

జిల్లాలో మూడురోజులపాటు ఆయన పర్యటిస్తారు. 13 నియోజకవర్గాలలో మొత్తం 500 కిలో మీటర్ల మేర జగన్‌ పర్యటన సాగుతుంది. వైఎస్‌ మరణాన్ని జీర్ణించుకోలేక అసువులు బాసిన 37 ప్రాంతాల్లోని 42 మంది వైఎస్‌ అభిమానుల కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి పరామర్శిస్తారు. 9న ఏలూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించి ఆ రోజు రాత్రి భీమవరంలో బస చేస్తారు. 10న నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

ఆ రోజు రాత్రి తాడేపల్లిగూడెంలో బస చేస్తారు. 11న గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో పర్యటించి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళతారు. ఎంపీ జగన్‌ పర్యటనపై ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని గృహంలో కాంగ్రెస్‌ నాయకులు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ నెల 9 నుంచి 11వరకు జగన్‌ పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై తుది విడతగా సమీక్ష జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X