శ్రీకృష్ణ కమిటీ గడువు పెంచొద్దు: లగడపాటి

Lagadapati Rajagopal
హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 31 వరకు ఆగకుండా మూడు నెలల ముందే కేంద్రానికి నివేదిక సమర్పించాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. తాను శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన ఏడో నివేదిక వివరాలు వెల్లడించారు. పదో తేదీలోగా మరో రెండు నివేదికలు ఇస్తానని, ఒకటి రక్షణ వ్యవహారాలపై (డిఫెన్స్), మరొకటి గంట నిడివి గల పవర్ పాయింట్ సీడీ అని ఆయన బుదవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. నివేదికల అందజేతకు గడువు పెంచకపోవడమే మంచిదన్నారు. దేశంలో ప్రాంతీయ విద్వేషం పెరిగిపోయిందన్నారు.

కులం, మతం, ప్రాంతీయత పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం సులువని, కొందరు ఓట్లు దండుకోడానికి దీన్ని సులువైన మార్గంగా ఎంచుకున్నారని ఆగ్రహించారు. తెలంగాణ ప్రజలు చాలా మంచివారని, అమాయకులని ఆయన కితాబిచ్చారు. పదవులకు రాజీనామా చేసి మళ్లీ వారే పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, వేరే వారికి ఇస్తే ఉపయోగకరమన్నారు. రెండో ఎస్సార్సీ ద్వారానే రాష్ట్రాల పునర్విభన సాధ్యమని సీడబ్ల్యుసీ తీర్మానించిందని, దానికి అంగీకరించాకే తెరాసతో 2004లో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నట్టు ఆయన చెప్పారు. కేసీఆర్ ఒత్తిడి మేరకే విస్తృత సంప్రదింపుల కోసం ప్రణబ్‌కమిటీని కేంద్రం నియమించిందన్నారు. కడప ఎంపీ వైఎస్ జగన్ తలపెట్టిన ఓదార్పుయాత్ర ఆయన వ్యక్తిగతమని, తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు తప్పకుండా మద్దతిస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+