19 తర్వాత పార్టీలతో భేటీ: దుగ్గల్

తమకు ఇప్పటి వరకు 50 వేలకు పైగా నివేదికలు అందాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇంకా పెద్ద యెత్తున నివేదికలు వస్తున్నాయని ఆయన చెప్పారు. వాటిలో 95 శాతం ఒకటి రెండు కాగితాలకే పరిమితమయ్యాయని, మిగతా ఐదు శాతం విలువైన సమాచారంతో, లోతైన అధ్యయనంతో ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐల నుంచి అధికారిక నివేదికలు అందాయని, తెలుగుదేశం, సిపిఎం కొంత సమయం అడిగాయని ఆయన చెప్పారు. గడువులోగా వాటి నుంచి నివేదికలు వస్తాయని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications