మహిళల మంత్రి పదవుల భద్రం

ప్రస్తుతం 9 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని రోశయ్య భర్తీ చేసే అవకాశాలున్నాయి. ప్రసుత మంత్రివర్గంలోని మంత్రులను ఎవరినైనా తొలగిస్తారా, లేదా అనేది కూడా ఉత్కంఠభరితమైన అంశంగానే మారింది. పలువురు సీనియర్ శాసనసభ్యులను దివంగత ముఖ్యమంత్రి పక్కన పెట్టారు. వారంతా ఇప్పుడు మంత్రి పదవులు వస్తాయని ఆశ పడుతున్నారు. జెసి దివాకర్ రెడ్డి, కె. జానారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్ి, మర్రి శశిధర్ రెడ్డి, పి శంకరరావు వంటి సీనియర్లు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అలాగే, ప్రస్తుత స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిపదవి ఆశిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, స్పీకర్ గా ఉత్తమ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications