మెదక్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ గురువారం ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఆయన పాల్గొన్న మెదక్ జిల్లా ఝరాసంగంలోని పెళ్లి వేడుకల్లో టెంట్ కూలింది. దీని నుంచి ఆయన బయటపడ్డారు. అలాగే, తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఘెరావ్ చేయడానికి ప్రయత్నించారు. సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మెదక్ జిల్లా ఝరాసంగంలో జగన్ జిల్లా పరిషత్ మాజీ చెర్ పర్సన్ సునీతా పాటిల్ కూతురు గీతాంజలి వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా ఆయనను అభిమానులు చుట్టుముట్టారు.