అల్మట్టి: కాంగ్రెసుపై ధ్వజమెత్తిన చంద్రబాబు

Chandrababu Naidu
విజయవాడ: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కృష్ణా బ్యారేజీపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం చేపట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కృష్ణా జలాల పంపకంపై ట్రిబ్యునల్ వద్ద ప్రభుత్వం సరిగా వాదించకపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన విమర్శించారు. సరైన న్యాయవాదిని పెట్టి బలమైన వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

కృష్ణా నది మిగులు జలాలపై ఆధారపడి తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానం వల్ల కృష్ణా జలాలు రాష్ట్రానికి అందే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపట్టడానికి ముందుకు రావాలని ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యను డిమాండ్ చేశారు. ఆల్మట్టి ఎత్తును అపించడానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. తాము శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసినా ఫలితం లేకుండా పోయిందని, పలు ఆందోళనలు చేపట్టామని, అయినా ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+