రాజీనామాకు సిద్ధపడిన చిదంబరం

దంతెవాడ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను ప్రధానికి అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. చిదంబరం లేఖ అందిన మాట వాస్తవమేనని ప్రధాని కార్యాలయం వర్గాలు చెప్పాయి. అయితే లేఖలోని వివరాలను వెల్లడించడానికి నిరాకరించాయి. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా చిదంబరం మరో లేఖ రాసినట్లు సమాచారం. నిఘా వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల, సిఆర్పీఎఫ్ జవాన్లకు సరైన శిక్షణ లేదని వచ్చిన విమర్శల వల్ల దంతెవాడ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిదంబరం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అయితే చిదంబరం రాజీనామాను ప్రధాని తిరస్కరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications