మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయని, అయితే అవి వెలుగులోకి రావడం లేదని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యార్థి సంఘాల సమాఖ్య(ఫిసా) అధికార ప్రతినిధి గౌతం గుప్త తాజాగా స్కై న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ''ఒకప్పుడే కాదు.. ఇప్పటికీ ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. కానీ, అవి బయటకు రావడం లేదు. ఇది మాకు ఆందోళన కలిగిస్తోంది'' అని పేర్కొన్నారు.
విద్యా రంగంలో పరస్పర సహకారానికి సంబంధించి ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన ఒప్పందంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ విద్యార్థుల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు