విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టులపై పోలీసులకు గవర్నర్ హిత బోధ

By Santaram
|
Google Oneindia TeluguNews

విజయవాడ: మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం విజయవాడ వచ్చిన ఆయన పోలీసు అధికారులతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఏలూరు రేంజి పరిధిలో మావోయిస్టుల ప్రభావంపై ఆరా తీసారు.

తూర్పుగోదావరి జిల్లా లోని ఏజెన్సీ ప్రాంతంలో వారి ప్రాబల్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కిందిస్థాయి అధికారులు, ఇంటిలిజెన్స్‌ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. ఎటువంటి లోటుపాట్లకు అవకాశం ఇచ్చినా దంతేవాడ లాంటి ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకునే అవకాశముందని హెచ్చరించారు.

ఎప్పుడూ మావోయిస్టులది పైచేయి కాకుండా చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఏలూరు రేంజి డీఐజీ మహేష్‌ భగవత్‌, విజయవాడ పోలీసు కమిషనర్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, రైల్వే ఎస్పీ కే వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ రామకృష్ణయ్య, తూర్పుగోదావరి జిల్లా అడిషనల్‌ ఎస్పీ (రంపచోడవరం) విక్రంజిత్‌ దుగ్గల్‌లు సమావేశంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X