వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో చేపల వేట నిషేధం

By Santaram
|
Google Oneindia TeluguNews

Krishna Dist
మచిలీపట్నం: సముద్రంలో చేపలు, రొయ్యల వేటను గురువారం నుంచి మే 31వ తేదీ వరకూ నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సముద్రంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ఈ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు మత్స్యశాఖ డీడీ సీతారామరాజు తెలిపారు. ఈ సీజనులో ఒక్కో చేప లక్షలాది గుడ్లను పెడుతుందని, గుడ్లు పిల్లలుగా రూపాంతరం చెందే సమయంలో చేపల వేటకు ఉపయోగించే వలలు తగలడం, అవి వలలో చిక్కుకోవడం జరిగి పిల్లలు చనిపోతాయని చెప్పారు. దీంతో మత్స్య సంపద గణనీయంగా తగ్గిపోయే ప్రమాదమున్నందున సముద్రంలో వేటను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఒక్కో బోటుకు రూ.2,500 జరిమానా విధించనున్నట్లు చెప్పారు. అవసరమైతే బోటు లైసెన్సును కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మత్స్య సహకార సంఘంలో సభ్యుడిగా ఉండి నెలకు రూ.75ల చొప్పున పొదుపు చేసిన ఒక్కో మత్య్సకారుడికి పొదుపు సొమ్ముతో కలిపి రూ.1800ల వరకూమంజూరు చేస్తామని చెప్పారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు 20 కిలోల బియ్యం ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.

జిల్లాలో చేపల వేటకు 950 బోట్లను వినియోగిస్తున్నారు. వీటిపై ప్రత్యక్షంగా ఆధారపడి ఆరువేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మెకనైజ్డ్‌ బోట్లు ద్వారా చేపలవేట కొనసాగించేవారు వారం, పదిరోజులపాటు సముద్రంలోనే గడుపుతారు. బోట్ల ద్వారా వచ్చిన సరుకును మార్కెటింగ్‌ చేయడం, చిన్న వ్యాపారులు, ఐస్‌ బ్లాక్‌ల తయారీ, ప్యాకింగ్‌ తదితర పనులను చేస్తూ మరో 7వేల మందికిపైగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X