విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ- షిర్డీ రైలు సర్వీసు పొడిగింపు!

By Santaram
|
Google Oneindia TeluguNews

Train
విశాఖపట్నం: విశాఖ-షిర్డీ రైలు సర్వీసులను మరికొద్ది రోజుల పాటు పొడిగించేందుకు వాల్తేరు డివిజన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు చీఫ్ కమర్షియల్ మేనేజర్ (సీసీఎం, భువనేశ్వర్)కు ప్రతిపాదనలు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జోనల్ అధికారుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ మేరకు అధికారులు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ప్రత్యేక సర్వీసులను సుమారు ఏడాది క్రితం ప్రవేశ పెట్టారు. ప్రతి బుధ, శనివారాల్లో నడిచే వీటికి అనతి కాలంలోనే ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సర్వీసులను అధికారులు నెలనెలా పొడిగిస్తు వస్తున్నారు.

ఈ సర్వీసు వల్ల విశాఖ నుంచి నేరుగా షిర్డీ వెళ్లేందుకు అనుకూలంగా వున్నందువల్ల వీటిని ప్రయాణికులు విశేషంగా ఆదరిం చారు. ఈ ఆదరణను గమనించిన అధికారులు ఈ మేరకు పొడిగిం చేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఇది పూర్తిస్థాయి సర్వీసుగా మార్పు చేసే అవకాశం వుందని అభిప్రాయం వ్యక్తమయ్యింది. మొన్నటి రైల్వే బడ్జెట్‌లో ఈ మేరకు ప్రతిపాదిస్తారని భావిం చారు. అయితే బడ్జెట్‌ లో ఈ సర్వీసుకు చోటు దక్కలేదు. అయితే ఏప్రిల్ నెలాఖరు వరకు నడుపుతున్నట్టు వాల్తేరు డివిజన్ అధికారులు ప్రకటించారు.

ఏప్రిల్ తరువాత ఈ సర్వీసులను కొనసాగించే అవకాశాల్లేవని, పూర్తిగా నిలిపివేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. దీనితో షిర్డీ ప్రయాణీకులకు అనుకూలంగా ఉన్న ఈ రైళ్ల సర్వీసులను నడపాలని (పొడిగించాలని) ప్రజల నుంచి వినతులు, విజ్ఞప్తులు అందాయి. బీజెపీ, పీఆర్‌పీ, సీపీఎం, సీపీఐ, టీడీపీ, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు వాల్తేరు డివిజన్ అధికారులు స్పందిం చినట్టు సమాచారం. ఈ రైలు కొనసా గించాల్సిన అను కూల అంశాలను వివరిస్తూ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌కు ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం. జోనల్ అధికారుల నుంచి సానుకూల స్పందన వస్తుందని ఈ సర్వీసులను కొన సాగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X