నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి మండలం చందాపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. చందాపూర్ రోడ్డులో కూలీ పని చేసుకునే సాయిలు బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు.
కోపంలో భార్య, ముగ్గురు కొడుకులు, కూతురును కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.