న్యూఢిల్లీ: ఢిల్లీ లజ్ పత్ నగర్ పేలుడు ఘటనలో సెషన్స్ కోర్టు ముగ్గురికి గురువారం మరణశిక్ష విధించింది. పద్నాలుగేళ్ల క్రితం లజ్ పత్ నగర్ లో సంభవించిన పేలుడులో 13 మంది మరణించారు, మరో 39 మంది గాయపడ్డారు. మరో నిందితుడిని కోర్టు దోషిగా గుర్తించి జీవిత ఖైదు వేసింది. మొహ్మద్ నౌషాద్, మీర్జా ఖాన్, అలీ భట్ లకు కోర్టు మరణశిక్ష విధించింది.
ఈ పేలుడు కేసులో ఆరుగురిని కోర్టు ఈ నెలారంభంలో దోషులుగా గుర్తించింది. వీరంతా కాశ్మీరీ మిలిటెంట్ గ్రూపునకు చెందినవారు. సాక్ష్యాలు లేకపోవడంతో మరో నలుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.