నిజామాబాద్ నుంచి డిఎస్ పోటీ?

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణానంతరం ఒకటిరెండు సార్లు డీఎస్ నిజామాబాద్ వెళ్లారు. తాజాగా ఉపఎన్నికల నేపథ్యంలో 25న జిల్లాకు రానున్న డీఎస్‌కు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత డీఎస్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవుతారని భావించారు. అనూహ్య పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సమీకరణలు మారాయి. మరో వైపు రాజ్యసభకు వెళ్లేందుకు కూడా డిఎస్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డీఎస్ నిజామాబాద్ ఉపఎన్నికవైపే మొగ్గు చూపినట్లు ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications