విశాఖలో పరిశ్రమలకు కేంద్రం బ్రేక్

అత్యంత సుందర నగరమైన విశాఖలో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ఆరు నెలల పాటు మారిటోరియం విధించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీచేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగుచూశాయి.
దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆయా ప్రాంతాల్లో సమగ్ర పర్యావరణ కాలుష్య సూచీ(సీపీసీఐ)ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ సీపీసీఐ ఆధారంగా దేశంలోని 83 నగరాల్లో కాలుష్య తీవ్రతను గణించింది. మన రాష్ట్రంలో పటాన్‌చెరు, బొల్లారం, విజయవాడ తదితర నగరాలలోనూ ఈ గణన నిర్వహించింది. విశాఖ నగరం వీటన్నింటినీ తోసిరాజని కాలుష్యంలో మొదటి స్థానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications