కాంగ్రెసు, టిడిపిలనూ పిలుస్తాం: శ్రీకృష్ణ

Srikrishna
హైదరాబాద్: కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను కూడా సంప్రదింపులకు పిలుస్తామని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పారు. గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన సభ్య కార్యదర్శి వికె దుగ్గల్, ఇతర సభ్యులతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏ పార్టీ నివేదిక ఇవ్వకపోయినా తమ పని ఆగిపోదని ఆయన అన్నారు. జూన్ చివరినాటికి సంప్రదింపుల ప్రక్రియను ముగించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే జూన్, జులై నెలల్లో సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు. విద్యార్థి సంఘాల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజలు సంతోషంగా ఉండాలనేదే తమ అభిమతమని ఆయన అన్నారు. సమస్యకు పరిష్కారం కనుక్కుంటామని ఆయన చెప్పారు.

రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమని ఆయన అన్నారు. తొలుత తమ కమిటీని వ్యతిరేకించినవారు కూడా ఇప్పుడు సహకరిస్తున్నారని ఆయన చెప్పారు. తమ సంప్రదింపుల ప్రక్రియ సజావుగా సాగుతోందని ఆయన అన్నారు. మే 6,7 తేదీల్లో మళ్లీ రాష్ట్ర పర్యటన ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపైనే కాకుండా రాష్ట్ర పరిస్థితిపై సమగ్రంగా అధ్యయన చేస్తున్నామని ఆయన చెప్పారు. గడువులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. అన్ని సమస్యలను అధిగమించి పరిష్కారం కనుక్కుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+