చిరుకు నిరసనగా మాలమహానాడు కర్రలు, కారం

Warangal
మహబూబాబాద్‌: సమైక్యవాదం విన్పిస్తున్న చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తే తగిన బుద్ధి చెబుతామని మాలమహానాడు హెచ్చరించింది. భద్రత లేకుండా తెలంగాణలో ఒంటరిగా పర్యటిస్తానని పీఆర్పీ అధినేత చిరంజీవి చేసిన ప్రకటనను నిరసిస్తూ మాలమహానాడు ఆధ్వర్యంలో గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా అధికార ప్రతినిధి పిల్లి సుధాకర్‌, మహిళలు చీపుర్లు, కారం, కర్రలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30సంవత్సరాల సినీ జీవితంలో తెలంగాణ ప్రాంతంలో ఆస్తులను సంపాదించుకుని, ఈ ప్రాంత ప్రజల భిక్షతో పేరు గడించి..నేడు తల్లిపాలు తాగి రొమ్మును తన్నిన చందంగా చిరంజీవి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు.

ఈ ప్రాంతంలోనే ఆయన సినిమాలకు విశేష ఆదర ణ ఉందని, తెలంగాణ రాష్ట్రం వద్దు సమైక్యాంధ్రనే కావాలని అన్న చిరంజీవి తెలంగాణలో అడుగుపెటనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయిని చంద్రమోహన్‌, దార కుమార్‌, ఇర్రి శ్రీనివాస్‌, దండెం వెంకన్న, లవకుమార్‌, చింతమల్ల కళావతి, పిల్లి సుశీల, కొచ్చెర్ల సంతోష, సుజాత, సోమమ్మ, దార పద్మ, దార ఉప్పలమ్మ, వడ్డె సావిత్ర, దార కళమ్మ, ఇర్రి రమాదేవి పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+