నిత్యానందకు 4 రోజుల పోలీసు కస్టడీ

బెంగళూరు విమానాశ్రయం నుంచి భారీ బందోబస్తుతో రామనగర్‌కు తరలించారు. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో నిత్యానందకు గురువారం రాత్రి తొమ్మిది గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి పదిగంటల తర్వాత రామనగర జిల్లా కోర్టు ముఖ్య న్యాయమూర్తి పుష్పావతి ఇంట్లో హాజరు పరిచారు. దాదాపు 20నిమిషాల పాటు విచారించిన న్యాయమూర్తి పోలీసుల విన్నపం మేరకు నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఆదేశించారు. భారీ బందోబస్తు మధ్య జడ్జి ఇంటి నుంచి బయటకు వచ్చిన నిత్యానంద పోలీసు కారు ఎక్కే సమయంలో ఓ యువకుడు దాడి చేశాడు. అంతకు మునుపు బెంగళూరు విమానాశ్రయం వద్ద కూడా ఓ దుండగుడు నిత్యానంద భుజంపై కొట్టాడు.












Click it and Unblock the Notifications