ఎంపీ కోట్లను అడ్డుకున్న సిఎం భద్రతా సిబ్బంది

అనంతపురం పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఇంధనం నింపుకునేందుకు కర్నూలులో ఆగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు వచ్చిన కోట్లను ముఖ్యమంత్రి భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కోట్ల ముఖ్యమంత్రిని కలవకుండనే వెళ్లిపోయారు. ఆయనతోపాటు జిల్లాపరిషత్ ఛైర్మన్ వెంకటస్వామి, కొడుమూరు శాసనసభ్యుడు మురళీకృష్ణలు కూడా ముఖ్యమంత్రిని కలవకుండనే వెనుదిరిగారు.
రోశయ్య విచారం, క్షమాపణ కోట్లను భద్రతాసిబ్బంది అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి రోశయ్య విచారం వ్యక్తం చేశారు. భద్రతాసిబ్బంది ప్రవర్తన వల్ల సూర్యప్రకాశరెడ్డి బాధ పడివుంటే క్షమించాలని కోరుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications