హైదరాబాద్: మే నెలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రోశయ్య గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మంచినీటి సరఫరా విషయంలో నాణ్యతపరంగా ఎక్కడా రాజీ పడవద్దని సీఎం సూచించారు.
తన జిల్లా పర్యటనల్లో ఎక్కువగా తాగునీటి సమస్యమీదే ప్రజలు ఫిర్యాదు చేశారని అధికారులకు చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారానికి 1818 గ్రామాలకు 174.80 కోట్ల రూపాయలు త్వరలో విడుదల చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.