చిదంబరం ప్రకటనపై స్పందించను: శ్రీకృష్ణ

తెలంగాణ, సమైక్యాంధ్ర అని కాకుండా తాము ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నెల పదవ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులతో, 11వ తేదీన మజ్లీస్ నాయకులు, లక్ష్మీ పార్వతితో సమావేశమవుతామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర జెఎసితో కూడా సమావేశమవుతామని ఆయన చెప్పారు. తమకు లక్షా పది వేలకు పైగా నివేదికలు అందాయని, వాటిని భవిష్యత్తు రెఫరెన్స్ కోసం దాచి పెడతామని ఆయన చెప్పారు.
కాగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తప్ప తెలంగాణకు మరో పరిష్కారం లేదని తెలంగాణ మేధావుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య ప్రతినిధులు శుక్రవారం శ్రీకృష్ణ కమిటీ సభ్యులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ సమస్య పెరుగుతుందనే వాదనలో నిజం లేదని వారన్నారు. తెలంగాణ కోసం ఎన్నో నిబంధనలను చేసినా వాటిని ఆంధ్రా పాలకులు తుంగలో తొక్కారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications