హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 'మహానాడు'కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో జరిగే మహానాడుకు దాదాపు 15వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్రస్థాయి నాయకుల నుంచి, ప్రాంతీయ కమిటీల నేతల వరకు ఈ మహానాడులో పాల్గొంటారు.
శనివారం తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు. మొత్తం 16 పర్యవేక్షణ కమిటీలకు సీనియర్ నాయకులను పర్యవేక్షకులుగా నియమించారు.