సింగపూర్: ఇండోనేషియాలో ఆదివారం స్వల్ప సునామీకి దారితీయగల భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టార్‌స్కేల్‌పై 7.4గా నమోదయింది. సమత్రా దీవిలో సునామీ హెచ్చరికను జారీచేశారు. సముద్రంలో సంభవించిన ఈ భూకంపం వల్ల భారీస్థాయిలో సునామి అవకాశం లేదని, స్థానికంగా అంతగా ప్రభావం చూపని సునామి రావొచ్చునని యునైటెడ్ స్టేట్స్ జీయోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) తెలిపింది.
సముద్రంలోని భూకంపం కేంద్రం వద్ద దీని ప్రభావం ఉండవచ్చునని, ఇది వందల కిలోమీటర్లు దాటి తీరందాకా వచ్చే అవకాశం లేదని యూఎస్ జీఎస్ తెలిపింది.