బాలయ్య గుంటూరు పర్యటనకు బందోబస్తు

దీనిలో భాగంగా సింహా చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనుతో కలిసి ఆయన లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వస్తున్నారు. సింహా దర్శకులు బోయపాటి స్వగ్రామం పెదకాకాని కావటంతో గ్రామంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శివాలయాన్ని సందర్శించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బాలయ్య విమానంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళగిరి లక్ష్మీ నరసింహ ఆలయానికి వస్తారు.
ఐదు గంటలకు ఆయన మంగళగిరి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ పూజలు అనంతరం పెదకాకాని శివాలయానికి తీసుకువచ్చేందుకు బోయపాటి శ్రీను ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సింహా చిత్రం విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఉత్సాహం ఉరకలెత్తుతోంది. దీంతో బాలయ్యను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు మంగళగిరి తరలి రానున్నారు. దీంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications