నాలో ప్రాంతీయతత్వం లేదు: రోశయ్య

తమది పేదల ప్రభుత్వమని ఆయన చెప్పుకుంటూ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, వీటిని అదుపు చేసి ఇటు రైతు నష్టపోకుండా అటు వినియోగదారుడు శక్తికి మించిన ధర చెల్లించే పరిస్థితి లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. మెదక్ జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని, జిల్లా పరిధిలోని కళాశాలలను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉంచేలా ఒకటి, రెండు రోజుల్లో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. మంత్రివర్గంలో అవినీతిపరులు ఉన్నారంటూ కాంగ్రెస్‌కే చెందిన కొందరు సీనియర్ నేతలు చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణ ఉండదని రోశయ్య స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications