అసలే పోలీసు, ఆపై మద్యం మత్తు!

Chittoor Dist
తిరుపతి: మందు కొట్టేసిన ఓ ఎస్‌ పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద వీరంగం చేశాడు. అక్కడ ఉన్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది, యాత్రికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. చివరకు చేసేదేమీ లేక మహిళా సెక్యురిటీ సిబ్బంది అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమలకు చెందిన ఎస్ ‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌(నెం.2726) సురేంద్రబాబు తిరుమలలో విధులు నిర్వహిస్తున్నాడు.

గురువారం వీక్లీ ఆఫ్‌ కావడంతో మెడికల్‌ కాలేజి సర్కిల్ ‌లో మద్యం సేవించి భూదేవి కాంప్లెక్స్‌కు చేరుకున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ మహిళా సెక్యూరిటీ సిబ్బందిపై చిందులు వేసి అసభ్యకరంగా మాట్లాడాడు. తిరుమలకు వెళ్తున్న ప్రయాణికులను సైతం దూషించాడు. సెక్యురిటీ సిబ్బంది సురేంద్రబాబును కట్టడి చేసే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేసి గాయపరిచాడు. సర్ది చెప్పబోయిన తోటి ఎస్‌ పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆదినారాయణపైనా తిరగబడ్డాడు.

మహిళా సెక్యురిటీ సిబ్బంది ఈ విషయంపై అలిపిరి టోల్‌ గేట్‌ లో ఉన్న ఏవీఎస్‌ వో శ్రీనివాసులుకు, అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, విజిలెన్స్‌ సిబ్బంది అతడ్ని వారించే ప్రయత్నం చేశారు. వారిపై కూడా తిరగబడ్డాడు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా మీకు గుర్తింపు కార్డులు ఉన్నాయా, మీరు ఎవరు అంటూ గద్దించి మాట్లాడాడు. చేసేదేమీ లేక అలిపిరి ఏఎస్‌ ఐ సదిపిరాళ్ల రెడ్డెప్ప, సిబ్బంది అతడ్ని అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లారు. పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కుతున్న సమయంలోనూ సురేంద్రబాబు అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్పటి వరకు ఓపికగా ఉన్న ఏఎస్‌ ఐ రెడ్డెప్ప, పోలీసు సిబ్బంది అతనికి తమదైన శైలిలో బుద్ధిచెప్పారు. అనంతరం పోలీసులు సురేంద్రబాబుపై కేసు నమోదు చేసి రుయా ఆస్పత్రికి మద్యం పరీక్ష కోసం పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+