• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ: హరికృష్ణతో ఎర్రబెల్లి ఢీ

By Pratap
|

Harikrishna
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో ప్రకటనల వివాదం చెలరేగింది. తెలంగాణలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జగన్‌ పర్యటనను అడ్డుకుంటామంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన ప్రకటన చిచ్చు రేపింది. దయాకర్ రావు ప్రకటనను అదే పార్టీకి చెందిన హరికృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే జగన్‌ పేరును ఆయన ఎక్కడా ప్రస్తావించ లేదు. ఎవరి పర్యటననైనా అడ్డుకోవడం, ఆవేశకావేషాలు పెంచుకోవడం సరైంది కాదంటూ హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే నాయకుల పర్యటనలు, అసహజ పరిస్థితుల్లో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించే నేతలను అడ్డుకోవడం, అడ్డుకోవాలని పిలుపునివ్వడం అప్రజాస్వామికమన్నారు. "ఏ పార్టీ నాయకుడైనా సరే పర్యటిస్తుంటే అడ్డుకోవడం సరికాదని చంద్రబాబే స్వయంగా ప్రకటించాక ఎర్రబెల్లి ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించడమే. గాంధీ, నెహ్రూ, పటేల్‌ తదితర జాతీయ నేతలను తమ ప్రాంతాల్లో పర్యటించవద్దని హెచ్చరించి ఉంటే మన దేశానికి స్వాతంత్య్రం సిద్దించేది కాదు. అదే విధంగా తమ ప్రాంతాల్లో పర్యటించవద్దని అన్న నందమూరి తారక రామారావుని అడ్డుకుని ఉంటే తెలుగుజాతి ప్రాశస్త్యం ప్రపంచ నలుమూలలా విస్తృతమయ్యేదా?"అని హరికృష్ణ అన్నారు.

Telangana Liberation day:నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి ఎలా కలిగింది..?

తెదేపా నేతల పర్యటనలు అడ్డుకోవాలని మరో పార్టీవారు, కాంగ్రెస్‌ నేతల పర్యటనలను అడ్డుకోవాలని ఇంకో పార్టీ వారు పిలుపునివ్వడం అప్రజాస్వామికమన్నారు. ఆవేశకావేషాలు రెచ్చగొట్టడం సరికాదని, విజ్ఞులైన ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారనేది రాజకీయ నాయకులు గుర్తించాలని సూచించారు. ఏ వ్యక్తి ఎక్కడికైనా పర్యటించవచ్చని, తన భావజాలాన్ని ప్రచారం చేసుకోవచ్చని, పరస్పర అవగాహనలు పెంచుకోవచ్చని స్పష్టంగా ఉందన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకునే నేతలు తాత్కాలిక ఆవేశాలను పెంచి పబ్బం గడుపుకోవాలని చూడరని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి తదితర నేతలు ఇకనైనా ప్రజలు తమపై ఉంచిన గురుతర బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలని ఉద్ఘాటించారు.

తెలంగాణ నేతలను రెచ్చగొట్టేలా సీమాంధ్ర నాయకులు ప్రకటనలివ్వడం, సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా తెలంగాణ నేతలు ప్రకటనలివ్వడం మానుకోవాలని నందమూరి హరికృష్ణ సూచించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరించ కూడదని, ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ప్రజల ఓట్లపై గెలిచి, రాజ్యాంగంపై ప్రమాణం చేసి, దేశ సమగ్రతను కాపాడతామని పేర్కొన్న ఎర్రబెల్లి తదితర నేతలు తమ దుందుడుకు వైఖరికి స్వస్తిచెప్పి అభివృద్ధి స్రవంతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించే ప్రయత్నం చేయడం ద్వారా భావితరాల అభిమానాన్ని చూరగొనాలని సూచించారు.

హరికృష్ణ ప్రకటనకు ప్రతిస్పందనగా ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారని తెలిసింది. వైఎస్‌ చేయబట్టే వరంగల్‌ జిల్లా ఎడారైందని, ఆయన కోసం చనిపోయే వారు తమ జిల్లాలో ఎవరూ లేరని, ఇప్పటికే జగన్‌ రావద్దని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, వచ్చి మరింత రక్తసిక్తం చేయొద్దనే ఉద్దేశంతో తాను పర్యటనను అడ్డుకుంటానని ప్రకటించానంటూ ఎర్రబెల్లి ఆ ప్రకటనలో పేర్కొనే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వరంగల్‌ జిల్లాకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీళ్లను ఎన్టీఆర్‌ తెచ్చారని, దాన్ని పూర్తి చేసింది చంద్రబాబు అని, వైఎస్‌ వచ్చి మహారాష్ట్ర అక్రమంగా బాబ్లీ, ఇతర 12 ప్రాజెక్టులు నిర్మిస్తున్నా అడ్డుకోకుండా ఉండి వరంగల్‌కు తాగునీరు కూడా లేకుండా చేశారని, అలా జిల్లాను ఎడారిగా మార్చిన వారి కోసం చనిపోయింది ఎవరూ లేరని అందులో పేర్కొంటారని తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X