వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దంతెవాడ నరమేధం: 44 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
రాయపూర్: మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఛత్తీస్‌ గఢ్‌లో మందుపాతర పేల్చి బస్సులో ప్రయాణిస్తున్న 44 మందిని బలి తీసుకున్నారు. మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలు సహా ప్రయాణికులు, పన్నెండు మంది ప్రత్యేక పోలీసు అధికారులు(ఎస్పీవోలు) ఉన్నారు. ఆరు వారాల కిందట 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలి తీసుకున్నారు. దంతెవాడ నుంచి సుకుమా వెళ్తున్న 'అశ్వని రాజ్‌కుమార్‌ ట్రావెల్స్‌' బస్సును చింగవరం-బుసారాస్‌ గ్రామాల మధ్య 4.45-5.15 గంటల మధ్య రిమోట్‌ కంట్రోల్‌ తో పేల్చేశారు. భారీ పేలుడు ధాటికి బస్సు యాభై అడుగుల మేర గాల్లోకి లేచింది. శకలాలుగా మారి కిందపడింది. సంఘటన సమయంలో బస్సు లోపల 35-40 మంది ప్రయాణికులు, బస్సుపై 20 మంది ఎస్పీవోలు ఉన్నారు. దంతెవాడకు 67 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఏడాదిలో దేశంలో జరిగిన అతిపెద్ద అయిదు నక్సల్స్‌ దాడుల్లో ఇది ఒకటి. దంతెవాడ జిల్లా కిరండోల్‌ అటవీ ప్రాంతంలో జిల్లా సాయుధ బలగాలు, ఎస్‌పీవోలు(పోలీసులకు సహాయంగా ఉండే గిరిజనులు) కలిసి మూడు రోజులుగా గాలింపులు నిర్వహించారు. బృందం సోమవారం మధ్యాహ్నానికి కాలినడకన సింగవరం చేరుకుంది. అదే సమయంలో దంతెవాడ నుంచి సుకుమా వెళ్తున్న ప్రవేటు బస్సు అక్కడికి వచ్చింది. పైకప్పుపై 20 మంది ఎస్పీవోలు ఎక్కారు. దాని వెనకనే పాల్వంచ వెళుతున్న ఐరన్‌ఓర్‌ లారీల్లో ఒక్కోదాన్లో 50 చొప్పున మొత్తం వంద మంది ఎక్కారు. సింగవరంలో బస్సు కదిలిన పది నిమిషాల్లోపే పేలుడు సంభవించింది. క్షతగాత్రులను సుకుమా(భద్రాచలం జగదల్‌పూర్‌ ప్రధాన రహదారిపై ఉంటుంది) ఆసుపత్రిలో చేర్చారు. పేలుడు జరగ్గానే లారీల్లో వెళుతున్న ఎస్పీవోలు పరారయ్యారు. ఘటనాస్థలం గాధీరాజ్‌ పోలీసు స్టేషన్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మందుపాతర సంఘటన స్థలంలో వాతావరణం అత్యంత భయానకంగా ఉంది. మానవ దేహాలు మాంస ఖండాలుగా తెగిపడి ఉన్నాయి. కొన్ని శరీర భాగాలు పక్కనున్న చెట్లకు చుట్టుకు పోయాయి. పేలుడుతో ముక్కలై మెలికలు తిరిగిన బస్సు శకలాల నుంచి రక్తం చుక్కలుచుక్కలుగా కారుతోంది. దిక్కులేని అనాధల్లా ప్రయాణికుల మృతదేహాలు రోడ్డు మీద పడి ఉన్నాయి. బస్సు ముందుభాగం దగ్గరే పేలుడు సంభవించడంతో అది తునాతునకలై ఇనుప ముద్దగా మారింది. పలుదేహాలు సీట్లలో ఇరుక్కుపోవడంతో సీట్లను కట్టర్లతో కోసి బయటికి తీయాల్సి వచ్చింది. పలువురి మొహాలు గుర్తుపట్టే విధంగా లేవు. సంఘటన స్థలంలో ప్రయాణికుల సామగ్రి, చెప్పులు, పోలీసుల ఆయుధాలు చెల్లాచెదరై పడిఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X