జగన్ విజ్ఞతతో వ్యవహరించాలి: కెసిఆర్

పార్లమెంటులో ఆయన సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేసి ప్లకార్డులు పట్టుకున్నారని అందుకే తెలంగాణవాదులు, విద్యార్థి సంఘాల నేతలు, తమ పార్టీ, తెలుగుదేశం నాయకులు జగన్ రాకను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తాను ఆంధ్ర ప్రాంతంలో పర్యటించే సందర్భంలో సమైక్యాంధ్ర కోసం మరణించినవారి కుటుంబాలనూ ఆదుకుంటామని చెబుతామని, దీనిపై ఉమ్మడి కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రాల సాధన కోసం మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని, అతి త్వరలోనే ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
తాను ఈనెల 29వ తేదీన విజయవాడకు వెళ్తానని, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి మద్దతిస్తామని చేసిన ప్రకటనను అనేక మంది స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనికన్నా ముందు 28వ తేదీన ఆంధ్రరాష్ట్ర ప్రజా పార్టీ విజయవాడలోనే నిర్వహించనున్న సమావేశంలోనూ పాల్గొనే అవకాశముంది. ప్రజా పార్టీ నేత శ్రీనివాస్ కోరిక మేరకు కేసీఆర్ 28వ తేదీనే విజయవాడకు బయల్దేరి వెళ్లాలని యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications