'చిరంజీవికి వ్యవసాయమంటే తెలుసా?'

పోలవరం సాధన యాత్ర చేపట్టడం, ఇందులో రాజకీయం లేదనడం తనకూ సంతోషమేనని చెబుతూ టీడీపీపై విమర్శలు చేయడం మాత్రం అనుచితమన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగని అనలేదని, లాభకరంగా లేకుండా దండగ వస్తోందని మాత్రమే అన్నట్టు చెప్పారు. రైతులకు పరపతి సౌకర్యం సకాలంలో ఇవ్వాలని, గ్రామం యూనిట్‌గా పంటల బీమా అమలు, పంటలకు గిట్టుబాటు ధరల కల్పన డిమాండ్లతో తాము ఆందోళన చేస్తున్నట్టు తెలిపారు. రైతు ఎక్కడ కష్టాల్లో ఉంటే అక్కడకు చంద్రబాబు చేరుకుని ఆదుకుంటారని చెబుతూ గోదావరి జిల్లాల్లో, ఒరిస్సాలో వరదలను ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై ఆందోళన చేస్తోంది తమ పార్టీఏనని చెప్పారు. ఇవేవీ తెలియకుండా టీడీపీ, చంద్రబాబుపై అవాకులు, చెవాకులు మాట్లాడటం చిరంజీవికి తగదన్నారు.












Click it and Unblock the Notifications